తన అనారోగ్యం వల్ల వేస్ట్ అయిన టైంని సమంత కవర్ చేసుకోవాలని అనుకుంటుంది. గత రెండు నెలలుగా తన అనారోగ్యం కారణంగా సమంత షూటింగ్ కి దూరంగా ఉండవలసి వచ్చింది. తిరిగి షూటింగ్లో పాల్గొంటున్నప్పటి నుండి నిరవధికంగా చిత్రీకరణలో పాల్గొంటోంది. “ఎటో వెళ్లిపోయింది మనసు”, నందిని రెడ్డి చిత్రం మరియు “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్రీకరణలో వెనువెంటనే పాల్గొంటూ వస్తుంది. “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” లొకేషన్ నుండి నేరుగా ఈ నటి నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్ర చిత్రీకరణలో పాల్గొన్నారు. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో ఒక పాట చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ‘ ఇప్పుడే మంచి డాన్సులు వేసి, పాట చిత్రీకరణ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాను’ అని సమంత అని ట్వీట్ చేసారు. ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో మొదలు కాబోతున్న షెడ్యూల్ తో పూర్తి కానుంది. ఇదిలా ఉండగా సమంత ప్రస్తుతం “ఎవడు” చిత్రీకరణలో పాల్గొంటుంది.