ఎన్.టి.ఆర్ సినిమా షూటింగ్ లో పాల్గున్న సమంత

samantha
కాస్త విరామం తరువాత అందాలభామ సమంత ఎన్.టి.ఆర్ నటిస్తున్న సినిమా షూటింగ్ లో పాల్గుంది. సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ‘రభస’ అనే వర్కింగ్ టైటిల్ తో సాగుతుంది. ఇటీవల సమంత అనారోగ్యం పాలైంది అని పుకార్లు వచ్చాయి. అయితే తాను వరుస షూటింగ్ లతో బిజీగా వుండి ఒక రెండు రోజుల విరామం కోరిందని తెలిపింది

ఇప్పుడు సమంత సెట్లో మెరిసి ఈ పుకార్లకు తెరదించింది. సమంత ఈ యాక్షన్ ఎంటెర్టైనర్ లో కొత్త లుక్స్ తో మెరవనుంది. కొన్నిరోజుల పాటూ సాగానున్న ఈ షెడ్యూల్ లో ఈరోజు సమంత, ఎన్.టి.ఆర్ పై కొన్ని ముఖ్య సన్నివేశాలను తీశారు. ప్రణీత సుభాష్ ఈ సినిమాలో మరో హీరోయిన్. బెల్లంకొండ సురేష్ నిర్మాత

ఈ సినిమానే కాకుండా సమంత వి.వి వినాయక్ చిత్రంలో, సూర్య సరసన మరో సినిమాలో కనిపించనుంది

Exit mobile version