సమంతకి బ్లాక్ బస్టర్ చిత్రాలకి విడదీయలేని సంభంధం ఉన్నట్టు తెలుస్తుంది. “ఏ మాయ చేశావే” చిత్రంతో పరిచయం అయిన ఈ నటి వరుసగా బ్లాక్ బస్టర్ చిత్రాలలో కనిపిస్తూ వచ్చింది. ప్రస్తుతం ఈ భామ తెలుగులోనే ఐదు చిత్రాలను చేస్తుంది. అందులో మూడు భారీ చిత్రాలు కావడం ఆసక్తికరం రామ్ చరణ్ సరసన “ఎవడు”, మహేష్ బాబు సరసన “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” మరియు నాగచైతన్య సరసన “ఆటోనగర్ సూర్య” చిత్రాలలో నటిస్తున్నారు ఇవి కాకుండా “ఎటో వెళ్లిపోయింది మనసు” మరియు నందిని రెడ్డి దర్శకత్వంలో సిద్దార్థ్ సరసన ఒక చిత్రంలోనూ కనిపించనున్నారు. ఈ చిత్రాలన్నీ విడుదలయ్యి విజయం సాదిస్తే టాలీవుడ్లో సమంత అగ్రస్థానానికి చేరుకోవడం కష్టమేమి కాకపోవచ్చు.