ప్రేమలో పడ్డ సమంత.!

Samantha
టాలీవుడ్ అందాల భామ సమంత ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకుంది. అలాంటి సమంత అందరికీ ఒక షాకింగ్ న్యూస్ ఇచ్చింది. సమంత తను వేరొకరికరితో ప్రేమలో ఉన్నానని, ఆ రిలేషన్ షిప్ చాలా సంతోషంగా ఉందని ఆమె అంది. ఈ మాటలన్నీ ఇటీవలే టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. కానీ తను ఎవరు అనేది మాత్రం చెప్పే సమయం ఇది కాదని చెప్పింది. డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ సినిమాతో తన పెర్ఫార్మెన్స్ కి మంచి మార్కులు కొట్టేసింది.

అలాగే తను నటించిన మల్టీ స్టారర్ మూవీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా జనవరిలో విడుదల కానుంది. ఇది కాకుండా ఎన్.టి.ఆర్ సరసన రెండు సినిమాల్లో నటించనుంది. సమంత సెలక్ట్ చేసుకున్న పర్సన్ తో రిలేషన్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. ఈ వార్త చదివి గుండె బద్దలైపోయిన పాఠకులకు మా తరపున సంతాపాన్ని తెలియజేస్తున్నాం.!

Exit mobile version