సమంత బాలివుడ్ ప్రవేశానికి సకలం సిద్దమయ్యింది. గౌతం మీనన్ దర్శకత్వంలో గతంలోనే “ఏక్ దీవానా త” చిత్రంలో చైనా పాత్ర వేసినా పూర్తి నిడివి గల చిత్రం చెయ్యబోతుంది . తెలుగు లో “ఎటో వెళ్లిపోయింది మనసు” గా వస్తున్న ఈ చిత్ర హిందీ వెర్షన్ లో సమంత మరియు ఆదిత్య రాయ్ కపూర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి “అస్సి నబ్బె పూరే సౌ” అనే పేరుని ఖరారు చేశారు. మొదట్లో ఈ పాత్రకు సోనం కపూర్ ని అనుకున్నా తరువాత ఈ చిత్రంతో సమంతను హిందీలో పరిచయం చెయ్యాలని గౌతం మీనన్ నిర్ణయించుకున్నారు. ఈ చిత్రంలో గౌతం మీనన్ ఎటువంటి మాయాజాలం చేయ్యబోతున్నారో వేచి చూడాలి. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఈ సంవత్సరం మే లో విడుదల కానుంది.