అల్లు అర్జున్ సరసన సమంత?

అల్లు అర్జున్ సరసన సమంత?

Published on Jan 14, 2014 4:50 PM IST

allu-arjun-samantha
ఇండస్ట్రీలో ప్రస్తుతం బాగా బిజీగా ఉన్న హీరోయిన్ సమంత. గత సంవత్సరం అత్తారింటికి దారేది సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సమంత ఈ సంవత్సరం తెలుగు, తమిళ భాషల్లో భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తోంది. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం సమంతకి మరో భారీ మూవీ ఆఫర్ వరించింది.

ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం రాబోయే ఆలు అర్జున్ సినిమాలో సమంత నటించనుంది. ప్రస్తుతం ఈ చర్చలు ప్రారంభదశలోనే ఉన్నాయి, ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకి డైరెక్టర్. జులాయి సినిమా తర్వాత అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న రెండవ సినిమా ఇది. అలాగే సమంతతో కూడా త్రివిక్రమ్ అత్తారింటికి సినిమా కోసం కలిసి పనిచేసారు. దాంతో వీరి కాంబినేషన్ బాగుంటుందని అందరూ అంటున్నారు.

ఫిబ్రవరిలో విడుదల కానున్న ఈ సినిమాకి చెందిన మిగిలిన వివరాలు త్వరలోనే తెలియజేసే అవకాశం ఉంది. సమంత ప్రస్తుతం మనం, రభస, సూర్య అంజాన్, వివి వినాయక్ సినిమాలో నటిస్తోంది.

తాజా వార్తలు