జబర్దస్త్ గా మలేసియా వెళ్తున్న సమంత

జబర్దస్త్ గా మలేసియా వెళ్తున్న సమంత

Published on Jan 3, 2013 8:10 PM IST

samantha
ఈ సంవత్సరం సమంత మరో బిజీ సంవత్సరాన్ని గడపనుంది. ప్రస్తుతం “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” మరియు “జబర్దస్త్” చిత్రాలు విడుదలకు సిద్దమయ్యాయి. దీని తరువాత ఎన్టీఆర్ – హరీష్ శంకర్ మరియు పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ కాంబో చిత్రాలలో నటించనుంది. ఎన్టీఆర్ మరియు హరీష్ శంకర్ ల చిత్రం జనవరి 4 నుండి మొదలు కానుంది. సమంత కొద్ది రోజుల తరువాత చిత్రీకరణలో పాల్గొంటుంది. “జబర్దస్త్” చిత్రంలో ఒక పాట చిత్రీకరణ కోసం సమంత మలేసియా వెళ్లనుంది. ఈ చిత్రంలో ఈ పాట మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయ్యింది. సిద్దార్థ్, సమంత మరియు నిత్య మీనన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు తమన్ సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు