ఆ వార్తల్ని కొట్టి పారేసిన సమంత

Samantha
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘అత్తారింటికి దారేది’. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్ లో షూట్ చేస్తున్నారు. తాజాగా గత కొద్ది రోజులుగా ఈ సినిమాకి పెద్ద ఎత్తున ఆడియో ఫంక్షన్ ఉండదని మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ నటించిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాకి కూడా ఎలాంటి ఆడియో ఫంక్షన్ చేయకుండా డైరెక్ట్ గా మార్కెట్ లోకి విడుదల చేసారు.

ప్రస్తుతం మీడియాలో వస్తున్న రూమర్స్ పై సమంత క్లారిటీ ఇచ్చింది. ‘ త్రివిక్రమ్ – పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఆడియో ఫంక్షన్ ఉంటుంది. ప్రస్తుతం వస్తున్న వార్తల్లో నిజం లేదు. త్వరలోనే ఆడియో రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తారని’ సమంత ట్వీట్ చేసింది. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగష్టు 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version