రాజకీయ పుకార్లను క్లారిఫై చేసిన సమంత

రాజకీయ పుకార్లను క్లారిఫై చేసిన సమంత

Published on Mar 31, 2014 12:02 PM IST

Samantha
ప్రస్తుతం సౌత్ ఇండియాలో బిజీ బిజీ గా ఉన్న టాప్ హీరోయిన్ సమంత. వరుస సినిమాలతో అస్సలు తీరిక లేకుండా షూటింగ్ లో పాల్గొంటోంది. మరోవైపు సినీ నటులంతా రాజకీయాలవైపు అడుగులేస్తున్న సంగతి కూడా మనకు తెలిసిందే. ఈ రాజకీయాల సెగ సమంతకు కోడా తగిలింది. గత కొన్నిర్ ఒజులుగా సమంత కూడా ఓ ప్రముఖ పార్టీ తరపున ప్రచారం చేయనుందని మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ వార్తల్లో నిజంలేదని చెప్పి ఆ వార్తలకు సమంత తెరదించింది. ‘నేను ఏ పార్టీ తరపున ప్రచారం చేయడం లేదు. ఇక ముందు కూడా ప్రచారం చేసే ఉద్దేశం లేదని’ సమంత ట్వీట్ చేసింది. సామంత ప్రస్తుతం తెలుగులో ఎన్.టి.ఆర్ రభస, వివి వినాయక్ సినిమాలో నటిస్తోంది. అలాగే ‘మనం’, ‘ఆటోనగర్ సూర్య’ సినిమాలు త్వరలో రిలీజ్ కానున్నాయి. అలాగే తమిళంలో సూర్య, విజయ్ సరసన సినిమాలు చేస్తోంది.

తాజా వార్తలు