అక్కినేని వారి కోడలు సమంతకు లక్కి హీరోయిన్ గా ఇండస్ట్రీలో పేరుంది. టాప్ స్టార్ గా అందరూ స్టార్ హీరోల సరసన నటించిన సమంత సక్సెస్ రేట్ చాలా ఎక్కువ. ఇక గత ఏడాది సోలో హీరోయిన్ గా ఓ బేబీ తో భారీ హిట్ అందుకుంది. కాగా ఈ బ్యూటీ చిన్నప్పటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. రెండు రోజులుగా బుల్లి సమంత ఫోటోని చూసి ఫ్యాన్స్, ఫిదా కావడంతో పాటు లైక్స్ తో విరుచుకుపడుతున్నారు.
ఇటీవల ప్రకటించిన టైమ్స్ మోస్ట్ డిసైరబుల్ ఉమెన్ 2019 అవార్డు సమంత గెలుచుకుంది. ఐతే రంగస్థలం, మజిలీ, ఓ బేబీ లాంటి వరుస హిట్లతో దూసుకుపోతున్న సమంత ఇటీవలే జాను సినిమాతో ఒక ప్లాప్ ని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం రెండు తమిళ సినిమాలతో బిజీగా ఉన్న సమంత, మోస్ట్ సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మెన్ 2 లో కూడా నటిస్తుంది.