సమంతా మరియు తమన్నా ఇద్దరూ నా ఫ్రెండ్స్ : కాజల్

సమంతా మరియు తమన్నా ఇద్దరూ నా ఫ్రెండ్స్ : కాజల్

Published on May 16, 2012 4:35 PM IST


హాట్ బ్యూటీ కాజల్ కాజల్ అగర్వాల్, సమంతా మరియు తమన్నా తన ఫ్రెండ్స్ అంటుంది. వీరిద్దరితో పాటుగా అనుష్క కూడా తనకు మంచి స్నేహితురాళ్ళు అంటుంది. మా మధ్య సినిమాల విషయంలో మా మధ్య పోటీ ఉంటుంది కాని సినిమా విజయం సాధిస్తే ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలుపుకుంటాము అంటుంది. మా మధ్య సినిమాల విషయంలో కూడా ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది అని చెప్పుకొస్తుంది. ప్రస్తుతం కాజల్ చేతిలో తెలుగులో మూడు, తమిళ్లో రెండు సినిమాలు ఉన్నాయి. మహేష్ బాబు సరసన సుకుమార్ డైరెక్షన్లో, రామ్ చరణ్ సరసన వివి వినాయక్ డైరెక్షన్లో, ఎన్టీఆర్ సరసన శ్రీను వైట్ల డైరెక్షన్లో ‘బాద్షా’ సినిమాల్లో నటిస్తుంది. తమిళ్లో విజయ్ సరసన ‘తుపాకీ’, సూర్య సారణ ‘మాట్రాన్’ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.

తాజా వార్తలు