టాలీవుడ్ టాప్ హీరోస్ గురించి సమంత మాటల్లో..

Samantha
టాలీవుడ్ లో అందాల భామ సమంత అగ్ర కథానాయికగా చెలామణీ అవుతోందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గత సంవత్సరం ఆమె టాప్ హీరోలైన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు,ఎన్.టి.ఆర్ లతో సినిమాలు చేసింది. అన్ని సినిమాలు తనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఈ అందాల భామ తను నటించిన హీరోల గురించి ఏమి చెప్పిందో సమంత మాటల్లోనే…

పవర్స్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి సమంత మాటల్లో.. ‘ పవన్ కళ్యాణ్ ఓ సూపర్ స్టార్.. ఆయన కెమెరా ముందే తప్ప బయట నటించరు. ఆయన కళ్ళను చూసి ఆయనేంటో చెప్పేయొచ్చు. అంత ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ అవేమీ లేవన్నట్టుగా ఆయన ఉంటారు. అత్తారింటికి దారేది సినిమాకి అంత పెద్ద సమస్య వస్తే ఆయన చలించకుండా మా అందరికీ ధైర్యాన్ని ఇచ్చారని’ అంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి సమంత మాటల్లో ‘ సెట్లో మహేష్ బాబు ఉన్నారంటే అస్సలు సమయమే తెలియదు. సైలెంట్ గానే జోకులేసేస్తారు. దూకుడు సమయంలో ఎన్నో సలహాలు ఇచ్చారు అవన్నీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకి పాటించాను. అవకాశం వస్తే మరోసారి నటించి హ్యాట్రిక్ హిట్ కొడతానని’ చెప్పింది.

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ గురించి సమంత మాటల్లో ‘ నా కెరీర్ మొదట్లో ఎన్.టి.ఆర్ తో సినిమా చేసే అవకాశం వచ్చింది. అది నా జీవితాన్ని మార్చేసింది. ఎన్.టి.ఆర్ తో సినిమా అనగానే తన మొదటి సినిమా నుంచి యమ దొంగ వరకు అన్నీ చూసేసాను. అవి చూసి వామ్మో ఏమి జోరు అనిపించింది. ఎన్.టి.ఆర్ ని చూడటానికి సెట్స్ కి వెళ్ళేదాన్ని. ప్రతి సీన్ కోసం 100% కృషి చేసాడు. ఇక డాన్స్ ల గురించి అయితే చెప్పనక్కర్లేదు. అలాంటి డాన్సర్ ని ఇంకెక్కడా చూడలేదని’ అంది.

Exit mobile version