‘ఓజి’ నుంచి ఊహించని అవతార్ లో సలార్ నటి

Sriya-Reddy-og

ఇంకొన్ని రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మరో చిత్రం రిలీజ్ కి వస్తున్న సంగతి తెలిసిందే. హరిహర వీరమల్లు తర్వాత ఓజి గా పవర్ స్టార్ తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. అయితే ఈ సినిమాలో అనేకమంది టాలెంటెడ్ నటులు ఉన్న సంగతి తెలిసిందే. ఒక సాలిడ్ గ్యాంగ్ స్టర్ సినిమాగా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ సినిమాలో సలార్ నటి శ్రేయ రెడ్డి కూడా ఉందని తెలిసిందే.

మరి ఆమెపై ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ ఇపుడు రివీల్ చేశారు. దీనిలో మాత్రం ఆమె పూర్తిగా ఒక ఊహించని అవతార్ లో ఉందని చెప్పాలి. ఓజి లాంటి స్టైలిష్ గ్యాంగ్ స్టర్ చిత్రంలో ఆమెని కూడా ఒక స్టైలిష్ లుక్ లోనే చాలా మంది ఊహించుకున్నారు కానీ సుజీత్ మాత్రం ఆమెని మాస్ అవతార్ లోకి మార్చేశాడు. ఈమె ఈ సినిమాలో గీత అనే పాత్రలో కనిపిస్తుందని కన్ఫర్మ్ చేశారు. ఇక సినిమాలో ఆమె నటన ఎలా ఉంటుందో చూడాల్సిందే.

Exit mobile version