మ్యాజిక్ చేయలేకపోతున్న అనిరుధ్.. కారణం ఏమిటంటే..?

కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఓ సినిమా చేస్తున్నాడంటే, ఆ సినిమాపై ప్రేక్షకుల్లో ఖచ్చితంగా అంచనాలు క్రియేట్ అవుతాయి. ఇక తెలుగులోనూ ఆయన సంగీతానికి అభిమానులు ఉన్నారు. స్టార్ హీరోలు తమ సినిమాలకు అనిరుధ్‌తో సంగీతం చేయించుకునేందుకు ఆసక్తిగా ఉన్నారు.

అయితే, ఓ సినిమా కేవలం అనిరుధ్ సంగీతం అందించడంలో ఆలస్యం అవుతున్న కారణంగా ఏడాది పాటుగా వాయిదా పడుతూ వస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ నుంచి వస్తున్న న్యూ ఏజ్ మ్యూజికల్ డ్రామా చిత్రం ‘మ్యాజిక్’. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ గతేడాది పూర్తయ్యింది.

కానీ, ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న అనిరుధ్ ఇతర ప్రాజెక్టుల కారణంగా ఈ సినిమాను పూర్తి చేయలేకపోయాడు. దీంతో ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. కాగా, ఇప్పుడు ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా ముగించాలని.. దీంతో 2026 ప్రథమార్థంలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. మరి ఈ సినిమాను ఈసారైనా అనుకున్న డేట్‌కు వస్తుందో లేదో చూడాలి. ఇక ఈ సినిమాలో సారా అర్జున్, అన్మోల్ కజాని, ఆకాష్ శ్రీనివాస్, సిద్ధార్థ్ తణుకు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Exit mobile version