తమన్నా గురించి రివీల్ చేసిన సాజిద్ ఖాన్

Tamannaah-and-Sajid-Khan

డైరెక్టర్ సాజిద్ ఖాన్ ‘హిమ్మత్ వాలా’ సినిమాను రీమేక్ చేస్తున్న సంగతి మంకు తెలిసిందే. జితేంద్ర, శ్రీదేవి నటించిన ఈ సినిమాలో ఎవరు నటించబోతున్నారని అందరిలో కుతూహలంగా ఉండేది. ఈ సినిమాలో జితేంద్ర పాత్రని అజయ్ దేవగన్ చేస్తున్నాడు, శ్రీదేవి పాత్రలో తమన్నా నటిస్తోంది. తమన్నా గత నాలుగు సంవత్సరాలుగా తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉంది.

ఒక ఇంటర్వ్యూ లో సాజిద్ ఖాన్ ను ఎందుకు తమన్నాను ఎంచుకున్నారని ప్రశ్నించగా ‘నాకు అజయ్ తో కలసి నటించడానికి హిందీ సినిమా హీరోయిన్స్ కాకుండా, సౌత్ ఇండియాలో పెద్ద హిరోయిన్ కావాలనుకున్నాను, అలాగే కొంతమంది తమన్నా సినిమాలను చూశామని, చూడడానికి చాలా అందంగా వుందని అన్నారు. ‘హిమ్మత్ వాలా’ కోసం నేను నిర్మాత వశు భగ్నాని, అజయ్ తనని కలిసినప్పుడు చాలా సంతోషంగా మా టీంతో కలసి పనిచేయడానికి ఒప్పుకుంది. ‘హిమ్మత్ వాలా’ సినిమాకి సంతకం చేయడానికి ముందు నేను ఆమె నటించిన ఏ సినిమాను చూడలేదని’ చెప్పారు.

ఈ మద్య జరిగిన ఓ ఇంటర్వ్యూ లో సాజిద్ ఖాన్ మాట్లాడుతూ తమన్నా నటన, పాటలలో డాన్సు ఈ సినిమాకి హైలెట్ అన్నాడు. తమన్నాకి పెద్దగా హిందీలో పేరులేదు అని ప్రశ్నిచగా సాజిద్ ఖాన్ సమాధానమిస్తూ ఈ అమ్మాయి కి అంత ఆదరణ లేక పోయిన తెరఫై చూసిన తరువాత ఆడియన్స్ ఆశ్చర్యపరిచే విదంగా తన నటన ఉందని అందరూ అంటారని’ అన్నాడు. ఈ సంవత్సరం అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలలో ‘హిమ్మత్ వాలా’ ఒకటి, ఈ సినిమాని మార్చ్ 29న విడుదల చేయనున్నారు.

Exit mobile version