లవ్లీ కోసం డబ్బింగ్ చెబుతున్న ఆది

లవ్లీ కోసం డబ్బింగ్ చెబుతున్న ఆది

Published on Jan 4, 2012 1:20 PM IST


డైలాగ్ కింగ్ సాయికుమార్ తనయుడు ఆది తను హీరోగా నటిస్తున్న ‘లవ్లీ’ చిత్రం కోసం డబ్బింగ్ చెప్తున్నాడు. ప్రస్తుతం శబ్దాలయ స్టుడియోలో ఈ చిత్రానికి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. శాన్వి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘ప్రేమకావాలి’ చిత్రం తరువాత ఆది నటిస్తున్న రెండవ చిత్రం ఇదే. బి.జయ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి బి..ఎ రాజు నిర్మాత. అనుప్ రూబెన్స్ సంగీతం అందించిన ఆడియో త్వరలో విడుదల కాబోతుంది. ఈ చిత్రాన్ని ఆర్.ఆర్ మూవీ మేకర్స్ వారు సమర్పిస్తుండగా జనవరి నెలాఖరులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు