అందాల భామ సాయి పల్లవి టాలీవుడ్‌లో తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఈ స్టార్ బ్యూటీతో సినిమా చేయాలని ప్రతి హీరో, దర్శకుడు ఆశిస్తుంటారు. అయితే, సాయి పల్లవి మాత్రం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుంది. ఆమె నటించిన లాస్ట్ చిత్రం ‘తండేల్’ పూర్తి రొమాంటిక్ డ్రామాగా ఫిబ్రవరిలో రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది.
అయితే, తండేల్ చిత్రం వాస్తవానికి 2024లోనే పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల ఆలస్యం కారణంగా ఈ చిత్రాన్ని 2025 జనవరిలో రిలీజ్ చేసేందుకు ప్రయత్నించి, చివరికి ఫిబ్రవరిలో రిలీజ్ చేశారు. కాగా, 2025లో సాయి పల్లవి ఒక్కటంటే ఒక్క తెలుగు చిత్రాన్ని కూడా ఓకే చేయలేదు. ఆమె చాలా కథలు విన్నా స్క్రిప్టు నచ్చకపోవడంతో ఆమె రిజెక్ట్ చేస్తూ వస్తోంది. ఇక బాలీవుడ్‌లో ప్రెస్టీజియస్ ‘రామాయణం’ చిత్రంలో సీతగా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.
దీంతో టాలీవుడ్‌లో 2025 ఏడాదిలో సాయి పల్లవి ఒక్క సినిమా కూడా ఓకే చేయకపోవడంతో అభిమానులు నిరాశకు గురవుతున్నారు. మరి ఈ బుజ్జితల్లి తన నెక్స్ట్ తెలుగు చిత్రాన్ని ఎప్పుడు ఓకే చేస్తుందో చూడాలి.


