బాలయ్య చేస్తున్నది నెగిటివ్ రోలా..?

బాలయ్య చేస్తున్నది నెగిటివ్ రోలా..?

Published on Nov 29, 2025 1:28 AM IST

NBK111

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో ఇటీవల ఓ సరికొత్త సినిమా అనౌన్స్ చేశారు. పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమాను NBK111 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందించనున్నారు. ఇక ప్రస్తుతం బాలయ్య నటించిన ‘అఖండ 2’ విడుదల తర్వాత డిసెంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. NBK111లో బాలయ్య డ్యూయల్ రోల్‌లో కనిపించనుండగా, ఈ ప్రాజెక్ట్‌ను చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిస్తున్నారు.

అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలయ్య ఓ నెగిటివ్ రోల్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలోని రెండు పాత్రల్లో ఒకటి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రగా ఉంటుందని.. అయితే అది విలన్ పాత్ర కాదని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటిస్తోండగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. వృద్ధి సినిమాస్ నిర్మాణ బాధ్యతలు తీసుకోగా, బాలకృష్ణ కుమార్తె తేజస్విని నందమూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఏదేమైనా షూటింగ్ కూడా మొదలు కాని ఈ సినిమాపై అప్పుడే భారీ హైప్ క్రియేట్ అవుతోంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు