వారాహి చలన చిత్రం అధినేత, ‘ఈగ, ‘అందాల రాక్షసి’ చిత్రాల నిర్మాత సాయి కొర్రపాటి వరుస సినిమాలతో కాస్త బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన బాలకృష్ణ చేస్తున్న లెజెండ్ సినిమాకి సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అది కాకుండా మరో రెండు సినిమాలను నిర్మిస్తున్నారు. అందులో ఓ సినిమాకి నటుడు అవసరాల శ్రీనివాస్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు.
తాజా సమాచారం ఏమిటంటే సాయి కొర్రపాటి ఆంద్ర, సీడెడ్ కి సంబందించిన ధూమ్ 3 రైట్స్ రైట్స్ ని భారీ మొత్తానికి కొనుక్కున్నారు. అమీర్ ఖాన్, కత్రిన కైఫ్, అభిషేక్ బచ్చన్, ఉదయ చోప్రా ప్రధాన పాత్రల్లో నటిచ్న్హిన ఈ సినిమా కోసం ఇండియా మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ సినిమాకి విజయ్ కృష్ణ ఆచార్య డైరెక్టర్.
ధూమ్ 3 సినిమా ఓకెసారి హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా రిలీజ్ కానుంది. ఈ సంవత్సరం రిలీజ్ అయిన చెన్నై ఎక్స్ ప్రెస్ మరియు క్రిష్ 3 సినిమాలు ఆంధ్రప్రదేశ్ లో మంచి బిజినెస్ చేసాయి. ప్రస్తుతం ధూమ్ 3 కి ఫుల్ క్రేజ్ ఉండడంతో ఈ సినిమాకూడా సరికొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుందని ఆశిస్తున్నారు.