‘సంబరాల ఏటి గట్టు’కి కొత్త విడుదల తేదీ అప్పుడే !

‘సంబరాల ఏటి గట్టు’కి కొత్త విడుదల తేదీ అప్పుడే !

Published on Sep 29, 2025 3:01 PM IST

sambarala

సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ చేస్తున్న భారీ బడ్జెట్ చిత్రమే “సంబరాల ఏటి గట్టు”. దర్శకుడు రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ యాక్షన్ ప్రాజెక్ట్ పట్ల మంచి హైప్ ఉంది. కాగా, ఈ సినిమా మొదట సెప్టెంబర్ 25, 2025న థియేటర్లలోకి రావాల్సి ఉండగా, ఐతే, విడుదల తేదీ వాయిదా పడింది. ఇప్పుడు అక్టోబర్ 15, 2025న ఈ సినిమా గురించి బిగ్ అప్ డేట్ ఇస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆ రోజు కొత్త విడుదల తేదీని ప్రకటిస్తారని తెలుస్తోంది.

కాగా ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి మరియు చైతన్య రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళంలో భారీ స్థాయిలో విడుదల కానుంది. జగపతి బాబు, శ్రీకాంత్, సాయికుమార్, అనన్య నాగళ్ల, రవి కృష్ణ మరియు ఇతర ప్రముఖ నటులు కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి ఈ సినిమా సాయి దుర్గ తేజ్ కి ఏ రేంజ్ హిట్ ను ఇస్తోందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు