బాలీవుడ్ ప్రెస్టీజియస్ మ్యాడాక్ హారర్ కామెడీ యూనివర్స్‌లో తాజాగా రాబోతున్న చిత్రం ‘థామా’. ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. అయితే, ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగు వెర్షన్లో తీసుకొచ్చేందుకు సురేష్ ప్రొడక్షన్స్ ముందుకొచ్చింది.
ఈ చిత్ర తెలుగు వెర్షన్ ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్లో నవాజుద్దీన్ సిద్దిఖీ శక్తివంతమైన వాంపైర్‌గా, రష్మిక మరో వాంపైర్‌గా కనిపించారు. ఇక హీరో కూడా వారిలా ఎలా మారుతాడు.. ఆపై అతడు ఎలాంటి పనులు చేస్తాడు అనేది ఈ ట్రైలర్ కట్లో చూపించే ప్రయత్నం చేశారు.
యాక్షన్, రొమాన్స్, కామెడీ కలబోసిన ఈ చిత్రం ప్రేక్షకులకు వైవిధ్యమైన అనుభూతి ఇవ్వనుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో పరేష్ రావల్ మరో కీలక పాత్రలో నటించగా ఈ చిత్రాన్ని ఆదిత్య సర్పోట్దార్ డైరెక్ట్ చేశారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి