సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా?

SaiDharmaTej
మెగా ఫ్యామిలీ కాంపౌండ్ నుండి ఇండస్ట్రీకి రానున్న యంగ్ హీరో సాయి ధరం తేజ్ ‘రేయ్’ మూవీ విడుదలకు సిద్దమవుతోంది. వైవిఎస్ చౌదరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇది కాకుండా సాయి ధరం తేజ్ ఎఎస్ రవికుమార్ చౌదరి డైరెక్షన్ లో సెకండ్ మూవీ షూటింగ్ జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం సాయి ధరం తేజ్ తన మూడో సినిమాకి సైన్ చేసాడు. ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ‘జోష్’ సినిమా డైరెక్ట్ చేసిన వాసువర్మ ఈ సినిమాని డైరెక్ట్ చేయనున్నాడు. ఈ సినిమాకి సంబందించిన మరిన్ని విశేషాలు, అధికారిక ప్రకటన త్వరలోనే తెలియజేసే అవకాశం ఉంది.

Exit mobile version