హైదరాబాద్లో సాయి ధరంతేజ్ తదుపరి చిత్రం

Sai-Dharam-Tej

ఏ.ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో సాయి ధరంతేజ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్లో కొన్ని సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో రెజీనా హీరొయిన్ గా నటిస్తుంది. వై.వి.ఎస్ చౌదరి తీస్తున్న ‘రేయ్’ సినిమాలో నటిస్తున్న సాయికిది రెండో సినిమా. దర్శకుడు ఏ.ఎస్ రవికుమార్ చౌదరి సాయి ధరంతేజ క్యారెక్టర్ ను కొత్తగా రాస్కున్నాడు. ఈ సినిమా ద్వారా సాయిలో వున్న కామెడీ టైమింగ్ ను మనకు చుపిస్తాడట. బన్నీ వాస్ మరియు హర్షిత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా గీతా ఆర్ట్స్ మరియు వెంకటేశ్వర సినిమా బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పిస్తున్నాడు. శ్రీ హరి ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version