కిష్కింధపురి సక్సెస్‌ ఇండస్ట్రీది – సాయి దుర్గ తేజ్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన కిష్కింధపురి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించగా, సాహు గారపాటి నిర్మించారు. సెప్టెంబర్ 12న విడుదలైన ఈ చిత్రం హౌస్‌ఫుల్ షోలతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా జరిగిన సక్సెస్ మీట్‌లో అనిల్ రావిపూడి, బాబీ, వశిష్ట, అనుదీప్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సాయి దుర్గ తేజ్ మాట్లాడుటూ.. “మంచి సినిమాలను ముందుకు తీసుకెళ్తున్న మీడియాకు ధన్యవాదాలు. సాహు గారితో నాకు చాలా కాలం నుంచి అనుబంధం ఉంది. ఆయన తమ్ముడు నా క్లాస్‌మేట్. అలాగే సాయి‌తో నాకు ముంబైలో యాక్టింగ్ క్లాస్‌ నుంచే పరిచయం, 15 ఏళ్లుగా మా జర్నీ కొనసాగుతోంది. ఈ స్టేజ్ నాకు ఒక రియూనియన్‌లా అనిపిస్తోంది. నా స్కూల్ ఫ్రెండ్స్ వశిష్ట, కనిష్కను కూడా ఇక్కడ కలవడం ఆనందంగా ఉంది. చేతన్ భరద్వాజ్ అద్భుతమైన సంగీతం అందించారు. అనిల్ గారు నాకు చాలా సన్నిహితులు. ఆయనతో మా మామయ్య సినిమా కోసం ఎదురుచూస్తున్నాను. ఈ సక్సెస్ మీట్‌లో అందరూ నవ్వుకుంటూ ఉండటం కూడా ఒక పెద్ద విజయమే. ప్రస్తుతం ఇండస్ట్రీ ఒక కొత్త దశలో ఉంది. మంచి కథలు, ఆడియన్స్‌ని ఎక్సైట్ చేసే సినిమాలు వస్తేనే థియేటర్లకు ప్రేక్షకులు వస్తారు. లిటిల్ హార్ట్స్, మిరాయ్, కిష్కింధపురి వంటి సినిమాలు విజయవంతంగా నడుస్తున్నాయి. మంచి కంటెంట్‌ను ఆడియన్స్ ఎప్పుడూ సపోర్ట్ చేస్తున్నారు. ఇంత పెద్ద హిట్ అందుకున్న కిష్కింధపురి టీమ్‌కి నా అభినందనలు.” అన్నారు.

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘కిష్కింధపురిని ఇంతగా ప్రేమించి బ్లాక్‌బస్టర్ చేసిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. బాబీ గారు, అనిల్ రావిపూడి గారు, వశిష్ట గారు, అనుదీప్ గారు గెస్ట్‌లుగా కాకుండా ఫ్యామిలీలా రావడం ఆనందంగా ఉంది. ఈ సినిమా తప్పక థియేటర్స్‌లో చూడాల్సినది. మీకు నచ్చితే మరికొందరికి చెప్పండి. మమ్మల్ని ఎప్పుడూ సపోర్ట్ చేస్తున్న మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు.” అన్నారు.

డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి పిలిచినప్పుడు హారర్ సినిమా అంటే నాకు భయం చూడలేను అని చెప్పాను. నిజంగా నాకు భయం. సాహు గారికి మాట ఇచ్చినట్టు ఈ సినిమా చూశాను. చాలా చోట్ల భయపడ్డాను. కొన్ని సీక్వెన్స్ లో థియేటర్స్ మొత్తం షేక్ అయింది. అందరూ భయపడ్డారు. ఈ సెప్టెంబర్ ఒక సక్సెస్‌ఫుల్ సెప్టెంబర్ అయింది. కొత్తలోక, మిరాయి కిష్కిందపురి, లిటిల్ హార్ట్స్ సినిమాలతో థియేటర్స్ కళకళలాడుతున్నాయి. కౌశిక్ అద్భుతంగా ఈ సినిమాను తీశాడు. ఇక్కడ నుంచి తను సక్సెస్ ని కంటిన్యూ చేస్తాడని కోరుకుంటున్నాను. తన నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాత సాహు గారికి, సాయి గారికి కంగ్రాజులేషన్స్. ఈ సినిమాతో మళ్లీ సక్సెస్ జర్నీ స్టార్ట్ చేసిన హీరో శ్రీనివాస్ గారు ఇదే కంటిన్యూ చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకోవాలని కోరుకుంటున్నాను.’ అని అన్నారు.

డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ.. ‘కౌశిక్ నాకు ఫస్ట్ సినిమా నుంచి తెలుసు. తన సినిమా బ్లాక్ బస్టర్ అవడం చాలా ఆనందంగా ఉంది. హీరో నిర్మాతల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు .హారర్ ఫిలిమ్స్ చాలా జాగ్రత్తగా తీయాలి. చాలా చాలా స్ట్రాంగ్ కంటెంట్ ఉంటేనే జనం థియేటర్స్ కి వస్తారు. హారర్ తో పాటు మంచి మెసేజ్ని పెట్టడం చాలా బాగా అనిపించింది. సాయి ఏ బ్యాగ్రౌండ్ లేనట్టుగానే చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. తన ఈ సినిమాతో విజయాన్ని అందుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. సాహు గారు ఈ సినిమాతో ఒక బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నారు. సంక్రాంతికి రాబోతున్న చిరంజీవి గారు అనిల్ గారు సినిమాలో కొన్ని పార్ట్స్ చూశాను. సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ కాబోతోంది. సాహూ గారికి కంగ్రాట్యులేషన్స్.’ అని అన్నారు.

డైరెక్టర్ వశిష్ట మాట్లాడుతూ.. ‘మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న టీమ్ అందరికీ కంగ్రాచ్యులేషన్స్. బెల్లంకొండ సాయి గారు కొత్త జోనర్ లో బ్లాక్ బస్టర్ కొట్టారు. సాహు గారికి, టీమ్ అందరికీ కంగ్రాజులేషన్స్.’

డైరెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ.. ‘ఇది అందరూ థియేటర్స్ లో చూడాల్సిన సినిమా. అందరూ మిస్ కాకుండా చూడండి. సాయి గారికి కంగ్రాజులేషన్స్. సాహు గారు ఇలాంటి సినిమాలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాను. కౌశిక్ నుంచి ఇలాంటి మరిన్ని సినిమాలు రావాలని కోరుకుంటున్నాను.’

ఈ కార్యక్రమంలో నిర్మాత సాహు గారపాటి, డైరెక్టర్ కౌశిక్, మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ కూడా పాల్గొని మాట్లాడారు. తమ సినిమాకు ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పారు.

Exit mobile version