హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న సాయి ధరమ్ తేజ్ కొత్త చిత్రం

sai-dharam-tej

‘రేయ్’ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెడుతున్న సాయి ధరమ్ తేజ్ ఆ సినిమా విడుదలకాకుండానే మరో సినిమానుషూటింగ్ ను మొదలుపెట్టాడు. ఈ ప్రారంభవేడుకలలో రాంచరణ్ మినహా మిగిలిన మెగా ఫ్యామిలీ సభ్యులంతా హాజరయ్యారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమై హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. సమాచారం ప్రకారం ఈ సినిమా ఇంట్రడక్షన్ సాంగ్ ను ఇప్పటికే తెరకెక్కించారు. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కొత్త లుక్ తో కనిపించనున్నాడు

ఈ సినిమాను ఏ.ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహిస్తున్నాడు. గీత ఆర్ట్స్ మరియు ఎస్.వి.సి సినేమాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. బన్నీ వాస్ మరియు హర్షిత్ రెడ్డి నిర్మాతలు. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు

Exit mobile version