బాహుబలి సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న ప్రభాస్, సాహూ విజయంతో దానిని మరింత పెంచుకున్నారు. సాహో ఫలితం వరకు ప్రభాస్ బాలీవుడ్ సక్సెస్ పై ఎక్కడో అనుమానం ఉండేది. బాహుబలి తరువాత విడుదలయ్యే ప్రభాస్ చిత్రాలు, బాలీవుడ్ లో విజయం సాధించడం కష్టమే అని అందరు అనుకున్నారు. కానీ వాళ్ళ అంచనాలు తల క్రిందులు చేస్తూ…సాహో నెగెటివ్ టాక్ లో కూడా 150 కోట్లకు పై వసూళ్లు అందుకుంది. దీనితో ప్రభాస్ ని ఇకపై బాలీవుడ్ లో ఆపడం కష్టమే అన్న మాట వినిపిస్తుంది.
ప్రభాస్ బాహుబలి సక్సెస్ తరువాత అభద్రతాభావంలో పడ్డ అక్కడ స్టార్ హీరోలు సాహోని తొక్కేయాలని చూశారు. బాలీవుడ్ ప్రముఖ క్రిటిక్స్ తరణ్ ఆదర్శ్ మరియు రాజీవ్ మసంద్ లాంటి వాళ్ళు దారుణమైన రేటింగ్స్ ఇవ్వడం జరిగింది. సాహూపై ఎంత దుష్ప్రచారం జరిగినా, హిందీ ప్రేక్షకులు ఆ చిత్రానికి బ్రహ్మరధం పట్టారు. బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు సైతం బాడ్ టాక్ వస్తే 100 కోట్ల వసూళ్లు సాధించడం కష్టం. కానీ ప్రభాస్ ఏకంగా 150 కోట్లకు పైగా వసూళ్లు అక్కడ సాధించారు. ఆ విధంగా బాలీవుడ్ తొక్కేయాలనుకున్నా ప్రభాస్ నిలబడ్డాడు.