అందరినీ ఆకట్టుకున్న సాహసం ట్రైలర్

Shahasam
మాచో హీరో గోపీచంద్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘సాహసం’. ఈ సినిమాను ఈ నెల 31న లేదా జూన్ మొదటి వారంలో విడుదలచేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.సినిమా ట్రైలర్ ని ఈ రోజు విడుదల చేశారు. ప్రతి విషయంలోను మంచి శ్రద్ధ తీసుకున్నారు, అందరినీ ఆశ్చర్యపరిచే విదంగా ఈ ట్రైలర్ ఉంది. పురాతన కాలం నాటి నిధి కోసం సాగే యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కింది.
ఈ మూవీ ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి – సాహసం ట్రైలర్

తాప్సీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా మంచి విజయాన్ని సాదిస్తుందని హీరో గోపీచంద్ చాలా నమ్మకంగా వున్నాడు. ‘నేను చాలా రోజుల నుండి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాను. నేను నటించిన ‘సాహసం’ సినిమా మంచి విజయాన్ని సాదిస్తుందని అనుకుంటున్నాను. ఈ సినిమా కోసం మేమందరం చాలా కష్టపడ్డాము. చాలా క్లిష్టమైన వాతావరణంలో ఈ సినిమా షూటింగ్ చేశాము. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం సూపర్బ్’ అని అన్నాడు.

ఈ సినిమా గురించి చంద్రశేఖర్ యేలేటి ఈ సినిమాకి పడ్డ కష్టాన్ని ఒక్క నిమిషంలో చెప్పలేము. అలాగే ఆయన మాట్లాడుతూ ‘ ఈ సినిమా 1947 నాటి బ్యాక్ డ్రాప్ తో మొదలై ప్రస్తుత రోజుల్లో ముగుస్తుంది. మేము ఈ సినిమాని పాకిస్తాన్ లో షూట్ చేయలనుకున్నాము. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల లడఖ్ లో షూట్ చేశాము. చాలా కష్టపడి సైనిక స్థావరంలో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించాము. ఇప్పటి వరకు తెలుగులో ఇలాంటి సినిమా రాలేదని’ అన్నాడు.

Exit mobile version