ఐటెం సాంగ్ లో మెరవనున్న జయం హీరోయిన్

sada-item-song

టాలీవుడ్ లో సదాఫ్ ది పరిచయం అవసరం లేని పేరు. తేజ ‘జయం’తో తెరపైకి తిరుగులేని ఎంట్రీ ఇచ్చిన ఈ భామకు తరువాత ఆశించనన్ని విజయాలు రాలేదు. ‘అపరిచితుడు’తో మరోసారి విజయపు రుచి చూసినా దానివల్ల సదాకు పెద్దగా ఉపయోగం ఏమి రాలేదు. దాదాపు తెరపై నుండి కనుమరుగవుతున్న సమయంలో ప్రస్తుతం విశాల్ తాజా చిత్రం “నటరాజు తానే రాజు” సినిమాలో ఒక ఐటెం సాంగ్ లో కనిపిస్తుంది. విజయ్ ఆంటోనీ ఈ సినిమాకి సంగీత దర్శకుడు
షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా త్వరలో భారీ విడుదలకు సిద్ధంగావుంది. వచ్చే వారంనుండి ఈ సినిమా ప్రచార కార్యక్రమాలలో విశాల్ చురుగ్గా పాల్గొనున్నాడు

Exit mobile version