మన టాలీవుడ్ లో చాలా వరకు సూపర్ హిట్ సినిమాలు ఆడియెన్స్ కి బాగా తెలిసినవి కూడా ఉంటాయి కానీ అలాంటి బ్యాంగర్ హిట్స్ ని అందించిన దర్శకులు ఒకింత అండర్ రేటెడ్ గానే ఉంటారు. మరి అలా మన తెలుగు ఆడియెన్స్ మర్చిపోలేని కొన్ని మాస్ హిట్ చిత్రాల్లో గోపీచంద్ “యజ్ఞం” కూడా ఒకటి.
ఒక్క యజ్ఞం మాత్రమే కాకుండా బాలయ్యతో “వీరభద్ర”, నితిన్ తో ఆటాడిస్తా అలాగే మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కి భారీ హిట్ పిల్లా నువ్వు లేని జీవితం లాంటి సినిమాలు దర్శకత్వం వహించిన ప్రముఖ దర్శకుడు రవికుమార్ చౌదరి ఇక లేరు అనే విషాద వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో బయటకి వచ్చింది.
అయితే తాను ఆకస్మిక గుండెపోటు వచ్చిన కారణంగా తుది శ్వాస విడిచారట. కాగా తన నుంచి చివరి సినిమాగా జోవియల్ స్టార్ రాజ్ తరుణ్ తో ‘తిరగబడరా సామీ’ వచ్చింది. ఇక ఈ దర్శకుని మరణ వార్తతో సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మరి వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మా 123తెలుగు యూనిట్ ఆకాంక్షిస్తుంది. ఓం శాంతి.