విషాదం: ఎం ఎం కీరవాణికి పితృ వియోగం!

విషాదం: ఎం ఎం కీరవాణికి పితృ వియోగం!

Published on Jul 8, 2025 9:57 AM IST

మన తెలుగు సినిమా సహా భారతీయ సినిమా కూడా గర్వించదగ్గ అతి తక్కువమంది సంగీత దర్శకుల్లో ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి కూడా ఒకరు. ఇప్పుడు పలు భారీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న తమ ఇంట ఇప్పుడు ఊహించని విషాదం చోటు చేసుకుంది. కీరవాణి తండ్రి శ్రీ శివశక్తి దత్తా గారు నేడు కాలం చేశారు.

నిన్న సోమవారం రాత్రి సమయంలో మణికొండ తమ నివాసంలోనే శివశక్తి దత్త తన 92వ ఏట తుది శ్వాస విడిచారని నిర్ధారణ అయ్యింది. అయితే తెలుగు సాహిత్యం, గీత రచన ఇతర కళలలో తెలుగు సినిమాకి సేవలందించిన వారు ఇప్పుడు లేకపోవడం తీరని లోటు. మరి ఈ విషయం తెలిసిన సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. మరి వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మా 123తెలుగు యూనిట్ కూడా ఆకాంక్షిస్తుంది. ఓం శాంతి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు