మన టాలీవుడ్ లో ఉన్నటువంటి ప్రముఖ దర్శకుల్లో రచ్చ, బెంగాల్ టైగర్, గౌతమ్ నంద లాంటి సినిమాలు అందించిన దర్శకుడు సంపత్ నంది కూడా ఒకరు. రీసెంట్ గా ఓదెల, సీటిమార్ లాంటి సినిమాలు కూడా తన నుంచి వచ్చాయి. అయితే ఒక ఊహించని విషాద వార్తని తాను ఇపుడు పంచుకున్నారు.
తన తండ్రి కిష్టయ్య ఇక లేరు అనే బాధాకర వార్తని తమ ఎమోషనల్ మాటల్లో సోషల్ మీడియాలో పంచుకొని విలపించారు. తన తండ్రితో చిన్ననాటి జ్ఞాపకాలు అన్నిటినీ నెమరు వేసుకొని మీరు ఇక లేరు అనే మాట నమ్మలేకపోతున్నాను అని ‘నువ్ లేకుండానే ఇక రేపు, ఎల్లుండి, జీవితమంతా.. ఇప్పటివరకూ నేను తీసిన సినిమాలు తప్ప వేరే ఏ సినిమా థియేటర్ లో చూడని నీ ప్రేమ నాకు మళ్లీ కావాలి’ అంటూ తన బాధ వ్యక్తం చేశారు.
అలాగే నీకు నలుగురు పిల్లలున్నారు.. వాళ్ళకీ పిల్లలున్నారు.. ఏ కడుపునైనా ఎంచుకో.. ఏ గడపనైనా పంచుకో.. కానీ మళ్లీ రా.. అంటూ తన తండ్రి పట్ల చూపించిన బాధ, ప్రేమ చూసి సోషల్ మీడియాలో సినీ ప్రముఖులు అభిమానులు కూడా మరింత విచారం వ్యక్తం చేస్తూ దర్శకునికి ధైర్యం చెబుతున్నారు.
????
బాపు.. నువ్ లేకుండానే ఇక రేపు, ఎల్లుండి, జీవితమంతా..నువ్ లేకుండానే తెల్లారింది..
నువ్ లేకుండానే ఓదెల లేచింది..
నువ్ లేకుండానే ఇల్లూ లేచింది.
కల్లాపి తో తడవాల్సిన వాకిలి కన్నీళ్ళతో తడిచింది..
“ఎట్లున్నవ్” అని అడగాల్సిన మనుషులు..
“ఎట్ల పోయాడు” అని అడుగుతున్నారు
ఎక్కెక్కి… pic.twitter.com/6tz1MuRmUw— Sampath Nandi (@IamSampathNandi) November 26, 2025


