స్టార్ హీరో ఆఖరి సినిమా కోసం ముందు వరుసలో టాప్ ప్రొడ్యూసర్?

స్టార్ హీరో ఆఖరి సినిమా కోసం ముందు వరుసలో టాప్ ప్రొడ్యూసర్?

Published on Nov 26, 2025 8:03 AM IST

Jana-Nayagan

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ సినిమానే “జన నాయకుడు”. విజయ్ కెరీర్ ఆఖరి సినిమాగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇక దీనిపై భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి. అయితే ఈ సినిమా తెలుగు రిలీజ్ కూడా జనవరి 9కే లాక్ అయ్యిన విషయం అందరికీ తెలిసిందే. మరి తెలుగు రిలీజ్ కోసం టాప్ ప్రొడ్యూసర్ ముందు వరుసలో ఉన్నట్టు ఇప్పుడు తెలుస్తోంది.

మరి ఆ నిర్మాత ఎవరో కాదు సితార నిర్మాత నాగవంశీ అట. కొన్నాళ్ల కితం విజయ్ లియో సినిమా హక్కులు తీసుకున్న సంగతి తెలిసిందే. మళ్లీ ఇప్పుడు విజయ్ ఆఖరి సినిమా తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేసేందుకు తను ఇంట్రెస్ట్ చూపుతున్నట్టు ఇప్పుడు టాక్. ఇక దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

తాజా వార్తలు