సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తన ఫేస్ బుక్ పేజ్ ద్వారా ఒక మైలు రాయిని చేరుకున్నాడు. ఫేస్ బుక్ పేజ్ లో 1 మిలియన్(10 లక్షల) ఫాలోవర్స్ ని సంపాదించుకున్న మొట్టమొదటి తెలుగు సినిమా డైరెక్టర్ గా కీర్తి సంపాదించుకున్నాడు. ఈ విషయంపై స్పందించిన రాజమౌళి ‘ నా ఫేస్ బుక్ పేజ్ 1 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసింది. అందరూ చూపించిన ప్రేమాభిమానాలకు నేను ఋణపడి ఉంటాను. అందరికీ థాంక్స్ అని’ ట్వీట్ చేసాడు.
ఇక్కడ గురించాల్సిన విషయం ఏమిటంటే ఒక్క తెలుగులోనే కాదు ఇండియాలోనే 1 మిలియన్ ఫాలోవర్స్ ని సంపాదించుకున్న డైరెక్టర్ కూడా రాజమౌళి నే కావడం విశేషం. ప్రస్తుతం రాజమౌళి బాహుబలి సినిమా కోసం త్వరలో తీయనున్న ఓ భారీ ఫైట్ సీక్వెన్స్ షూటింగ్ ప్లానింగ్ లో ఉన్నారు. ఈ షెడ్యూల్ త్వరలోనే మొదలు కానుంది. అలాగే ఈ షెడ్యూల్ కంటిన్యూగా 60 రోజులు జరగనుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా, అనుష్క ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
కె. రాఘవేంద్ర రావు సమర్పణలో ఆర్కా మీడియా బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.