టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న రయ్ రయ్

టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న రయ్ రయ్

Published on Oct 31, 2012 7:14 PM IST


‘ఈ రోజుల్లో’ ఫేం శ్రీ హీరోగా అక్ష హీరోయిన్ గా రూపొందుతున్న ‘రయ్ రయ్’ చిత్ర చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తయ్యింది. ఇక ఈ సినిమాలోని కొన్ని పాటలను మాత్రమే చిత్రీకరించాల్సి ఉంది. సుధీర్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని బి.ఆర్ కృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర దర్శకుడు వివరాలు తెలియజేస్తూ ‘ ఈ సినిమా ఒక రూరల్ మిల్ నేపధ్యంలో సంతోషంగా తన జీవితాన్ని గడిపేసే ఒక లక్కీ కుర్రాడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. శ్రీ మరియు అక్ష చాలా బాగా నటించారు. సినిమాని మేము అనుకున్న టైంకి మరియు అనుకున్న బడ్జెట్ తో ముగిస్తున్నాము’ అని ఆయన అన్నారు. అక్ష మాట్లాడుతూ నేను తెలుగులో చేస్తున్న 6వ సినిమా ఇది మరియు సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు చాలా ఆడుతూ పాడుతూ గడిపేసాం అని చెప్పారు. ఈ సందర్భంగా ఈ చిత్ర నిర్మాత మాట్లాడుతూ ‘ సినిమా బాగా రావాలని దర్శకుడు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. ఆయనకీ నా ధన్యవాదాలు తెలుపుతున్నానని’ ఆయన అన్నారు.

తాజా వార్తలు