ఓవర్సీస్ లో భారీగా రిలీజ్ కానున్న రామయ్యా వస్తావయ్యా

Ramaiya_Vastavaiya

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటించిన ‘రామయ్యా వస్తావయ్యా’కి రిలీజ్ ముందే మంచి క్రేజ్ రావడమే కాకుండా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాని ఓవర్సీస్ లో అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారని డైరెక్టర్ హరీష్ శంకర్ తెలిపాడు.

అత్తారింటికి దారేది సినిమాని ఓవర్సీస్ లో రిలీజ్ చేసి సూపర్ సక్సెస్ అందుకున్న మైత్రి మూవీస్ వారు రామయ్యా వస్తావయ్యా సినిమాని ఓవర్సీస్ మార్కెట్ లో రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీని ఓవర్సీస్ లో ఏ సౌత్ ఇండియన్ సినిమాని రిలీజ్ చేయనన్ని స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నారు.

అది కాకుండా డైరెక్టర్ హరీష్ శంకర్ ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ కి ఎన్.టి.ఆర్ ఇంట్రడక్షన్ సీన్ మిస్ అవ్వద్దని తెలిపారు. హరీష్ శంకర్ సినిమాలో మనకు ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వ నున్నాడు అనేదాని రేపటి వరకు వేచి చూడాల్సిందే. సమంత హీరోయిన్ గా కనిపించనున్న ఈ మూవీలో శృతి హాసన్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. దిల్ రాజు నిర్మించిన ఈ మూవీకి థమన్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు.

Exit mobile version