యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటించిన ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా ఈ వారం భారీ ఎత్తున రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. ఈ సినిమా ఈ శుక్రవారం అనగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు మొదట్లో ఎన్ని థియేటర్స్ వీలైతే ఆన్ని థియేటర్స్ లో రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.
సీమాంధ్రలో 10 – 16 వరకు బంద్ లకు కాస్త బ్రేక్ ఇవ్వనున్నారు. దాంతో ఈ చిత్ర ప్రొడక్షన్ మొదటి వారంలో మంచి బిజినెస్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఎన్.టి.ఆర్ ఎంతో యూత్ ఫుల్ గా మరియు పవర్ఫుల్ గా కనిపించనున్న ఈ మాస్ ఎంటర్టైనర్ కి హరీష్ శంకర్ డైరెక్టర్. సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శృతి హాసన్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. థమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.