‘హరిహర వీరమల్లు’ ట్రైలర్.. 3.01 నిమిషాల విధ్వంసం!

‘హరిహర వీరమల్లు’ ట్రైలర్.. 3.01 నిమిషాల విధ్వంసం!

Published on Jul 2, 2025 8:01 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ రేపు(జూలై 3) ఉదయం 11.10 గంటలకు ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకులు క్రిష్, జ్యోతికృష్ణ డైరెక్ట్ చేసిన ఈ హిస్టారికల్ ఎపిక్ యాక్షన్ డ్రామాలో పవన్ కళ్యాణ్ ప్రేక్షకులను స్టన్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక ఈ ట్రైలర్ లాంచ్‌ను గ్రాండ్‌గా చేసేందుకు మేకర్స్ భారీ ప్లాన్ చేస్తున్నారు.

అయితే, ఈ ట్రైలర్‌కు సంబంధించి అన్ని పనులు ముగిశాయి. ఈ ట్రైలర్‌కు సెన్సార్ వర్క్ జరిగిందని.. ఈ ట్రైలర్ 3.01 నిమిషాల పాటు ప్రేక్షకులను అబ్బుర పరిచేందుకు సిద్ధంగా ఉందని మేకర్స్ వెల్లడించారు. ఈ ట్రైలర్‌తో ప్రేక్షకుల్లో సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు కావడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది.

ఇక పవన్ కూడా ఈ ట్రైలర్‌ను వీక్షించి, అదిరిపోయిందని మెచ్చుకున్నారు. దీంతో ఈ ట్రైలర్‌పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాలో అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోండగా బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏ.ఎం.రత్నం ప్రొడ్యూస్ చేస్తున్నారు. జూలై 24న హరిహర వీరమల్లు చిత్రం పాన్ ఇండియా భాషల్లో గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు