పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రాల్లో భారీ హైప్ సెట్ చేసుకొని రిలీజ్ కి సిద్ధం అవుతున్న చిత్రం ఏదన్నా ఉంది అంటే అది “ఓజి” అని చెప్పాలి. దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ హై ఎండ్ యాక్షన్ చిత్రం నుంచి ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్న మొదటి పాట ఈ సాయంత్రం వస్తుండగా ఎలాంటి ప్రోమో లాంటిది లేకుండానే భారీ హైప్ ఈ సాంగ్ సెట్ చేసుకుంది.
ఇక ప్రోమో రాలేదు కానీ సాంగ్ రన్ టైం మాత్రం ఇప్పుడు వచ్చేసింది. ఈ సాంగ్ సరిగ్గా అంటే సరిగ్గా 4 నిమిషాల నిడివితో మేకర్స్ కట్ చేశారు. సో స్పీకర్స్ అన్నీ నాలుగు నిమిషాల పాటుగా బ్లాస్ట్ అనే చెప్పాలి. థమన్ నుంచి ఏ సాంగ్ పై కూడా లేని రేంజ్ హైప్ దీనిపై ఉంది. మరి ఈ సాంగ్ అందరికీ సమాధానం ఇస్తుందో లేదో తెలియాలి అంటే ఈ సాయంత్రం వరకు ఆగాల్సిందే. ఇక ఈ అవైటెడ్ సినిమా సెప్టెంబర్ 25న గ్రాండ్ గా విడుదలకి రాబోతుంది.
❤️???????? – #Firestorm #OG #TheyCallHimOG pic.twitter.com/YESpHctGFW
— DVV Entertainment (@DVVMovies) August 2, 2025