ప్రస్తుతం కోలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం నిజమైతే అల్లు అర్జున్ త్వరలోనే తన తొలి తమిళ సినిమాలో నటించబోతున్నాడు. చాలా రోజుల క్రితమే అల్లు అర్జున్ తనకు ఓ డైరెక్ట్ తమిళ సినిమాలో నటించాలని ఉందని తెలిపాడు. అప్పట్లో కొంతమంది తమిళ డైరెక్టర్స్ తో కథా చర్చలు కూడా జరిగాయి కానీ ఒక్కటి కూడా కార్యరూపం దాల్చలేదు. ఒక ప్రముఖ దిన పత్రిక అల్లు అర్జున్ త్వరలోనే తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కనున్న సినిమాలో నటించనున్నాడని ప్రచురించడం జరిగింది. ఈ రిపోర్ట్ ప్రకారం ‘ఓకే ఓకే’, ఎస్.ఎం.ఎస్ సినిమాలకు దర్శకత్వం వహించిన రాజేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. కె.ఈ. జ్ఞానవేల్ రాజా ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. రాజేష్ ప్రస్తుతం కార్తీ, కాజల్ నటిస్తున్న ‘అల్ ఇన్ అల్ అజుగు రాజ ‘ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. అల్లు అర్జున్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రాబోతున్న ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా షూటింగ్ లో భాగంగా స్పెయిన్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు సంబందించిన పూర్తి వివరాలు అల్లు అర్జున్ స్పెయిన్ నుండి రాగానే తెలిసే అవకాశం వుంది. ఈ సినిమాకి డేట్స్ ఇచ్చేదాని కంటే ముందు అల్లు అర్జున్ సురేందర్ రెడ్డి సినిమాని పూర్తి చేయాల్సి ఉంది .
అల్లు అర్జున్ కోలీవుడ్ ఎంట్రీ పై వస్తున్న రూమర్స్?
అల్లు అర్జున్ కోలీవుడ్ ఎంట్రీ పై వస్తున్న రూమర్స్?
Published on Apr 1, 2013 11:40 PM IST
సంబంధిత సమాచారం
- ‘ఓజి’, ‘ఉస్తాద్’ లని ముగించేసిన పవన్.. ఇక జాతరే
- ఆసియా కప్ హై వోల్టేజ్ మ్యాచ్: పాకిస్థాన్ని 7 వికెట్ల తేడాతో చిత్తు చేసిన టీమ్ ఇండియా
- ‘మోహన్ బాబు’ది విలన్ పాత్ర కాదు అట !
- ఒకే రోజు 1.5 మిలియన్ వసూళ్లు కొట్టిన ‘ఓజి’, ‘మిరాయ్’
- సూర్య, వెంకీ అట్లూరి ప్రాజెక్ట్ కి భారీ ఓటిటి డీల్?
- ‘మిరాయ్’, ‘హను మాన్’ సంగీత దర్శకుడు ఎమోషనల్ వీడియో!
- క్రేజీ క్లిక్: ‘ఓజి’ ఫ్యాన్స్ కి ఇది కదా కావాల్సింది.. పవన్ పై థమన్ సర్ప్రైజ్ ఫోటో
- హిందీలో డే 2 మంచి జంప్ అందుకున్న “మిరాయ్” వసూళ్లు!
- మెగాస్టార్ తో ‘మిరాయ్’ దర్శకుడు !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సమీక్ష : కిష్కింధపురి – ఆకట్టుకునే హారర్ అండ్ యాక్షన్ డ్రామా !
- సమీక్ష : డెమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ – విజువల్ ట్రీట్‌తో పాటు ఎమోషనల్ బీట్
- ఫోటో మూమెంట్ : ఓజి టీమ్‌తో ఓజస్ గంభీర క్లిక్..!
- నార్త్ లో ‘మిరాయ్’ కి సాలిడ్ ఓపెనింగ్స్!
- ‘మహావతార్ నరసింహ’ విధ్వంసం.. 50 రోజులు రికార్డు థియేటర్స్ లో
- ‘ఓజి’ నుంచి సాలిడ్ అప్డేట్.. ఎప్పుడో చెప్పిన థమన్
- ‘మిరాయ్’ కి కనిపించని హీరో అతనే అంటున్న నిర్మాత, హీరో