ఆ సినిమా సీక్వెల్ ను కమల్ చేయట్లేదట !

ఆ సినిమా సీక్వెల్ ను కమల్ చేయట్లేదట !

Published on Mar 17, 2020 7:50 PM IST

నేషనల్ స్టార్ కమల్ హాసన్ సూపర్ హిట్ చిత్రాల్లో ‘వెట్టైయాడు విలైయాడు’ అనే సినిమా ఒకటి. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో ‘రాఘవన్’ పేరుతో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. పూర్తిస్థాయి క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జానర్లో రూపొందిన ఈ చిత్రానికి చాలామందే అభిమానులున్నారు.

కాగా ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందనుందని కొన్ని రోజులుగా సోషల్మీ డియాలో వార్తలు వస్తున్నట్లు తెలుస్తోందే. అయితే తాజాగా కమల్, గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశం లేదట. ఈ వార్తల గురించి తమిళ్ సినీ వర్గాలు ఆరా తీయగా వాటిలో ఎలాంటి నిజం లేదని, అవన్నీ పుకార్లేనని తేలింది.

ప్రస్తుతం కమల్ ‘ఇండియన్ 2’ చిత్రీకరణలో బిజీగా ఉండగా గౌతమ్ మీనన్ పలు కొత్త ప్రాజెక్ట్స్ చేసేందుకు సిద్దమవుతున్నారు.

తాజా వార్తలు