మహేష్ రోల్ పై మళ్ళీ క్రేజీ రూమర్ !

మహేష్ రోల్ పై మళ్ళీ క్రేజీ రూమర్ !

Published on May 11, 2020 5:01 PM IST


టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్సకత్వంలో కామెడీ కింగ్ వెంకటేష్, యంగ్ హీరో వరుణ్ తేజ్ సూపర్ హిట్ సినిమా ‘ఎఫ్ 2’కు సీక్వెల్ ‘ఎఫ్ 3’ గురించి తాజాగా ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ చిత్రంలో ఒక చిన్న అతిధి పాత్రలో కనిపించనున్నారట. మహేష్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నట్లు అంతకుముందు నివేదికలు వచ్చాయి, కానీ ఇప్పుడు అది కేవలం అతిధి పాత్ర మాత్రమే అని చర్చ జరుగుతుంది. అయితే ఈ వార్త నిజమా కాదా అనేది ఇంకా తెలియలేదు. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఇది పూర్తిగా అవాస్తవం అని తెలుస్తోంది.

ప్రస్తుతం అనిల్ రావిపూడి ఈ సినిమా స్క్రిప్ట్ తయారుచేసే పనిలో ఉన్నారు. అయితే కరోనా కారణంగా ఈ సినిమాని వచ్చే ఏడాదికి పోస్ట్ ఫోన్ చేసారని తెలుస్తోంది. ప్రజెంట్ వెంకీ ‘నారప్ప’ సినిమా పూర్తి చేయాల్సి రావడం, వరుణ్ తేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో ఒక చిత్రం చేస్తుండటం.. ఈ రెండు సినిమాలు కరోనా కారణంగా ఆగిపోవడంతో ఆ ఎఫెక్ట్ ఎఫ్ 3 మీద పడింది. అందుకే వచ్చే ఏడాదికి ‘ఎఫ్ 3’ని మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు