ఆర్ ఆర్ ఆర్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. !


అందరూ అనుకున్నదే జరిగింది. ఆర్ ఆర్ ఆర్ మళ్ళీ వాయిదా పడింది. ఈ ఏడాది జులై 30న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడంతో జనవరి 8, 2021కి విడుదల వాయిదా వేశారు. ఇక తాజాగా సంక్రాంతికి కూడా ఆర్ ఆర్ ఆర్ వచ్చేది కష్టమే అని నిర్మాత దానయ్య క్లారిటీ ఇచ్చారు. 30శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటి పరిస్థితులలో పూర్తి చేయడం చాలా కష్టం అన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. దీనితో మరో నాలుగు నెలలు ఆర్ ఆర్ ఆర్ విడుదల వాయిదాపడనుంది అని తెలుస్తుంది.

ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలు చేస్తున్నారు. ఇప్పటికే చరణ్ పుట్టినరోజు కానుకగా చరణ్ ఫస్ట్ లుక్ వీడియో విడుదల చేయగా అద్భుత రెస్పాన్స్ దక్కించుకుంది. ఈనెల 20న ఎన్టీఆర్ పుట్టినరోజు రోజు నేపథ్యంలో కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో రానుంది. ఐతే ఈ వీడియో పై సందిగ్దత కొనసాగుతుంది.

Exit mobile version