ఆర్ ఆర్ ఆర్ ఆ విషయంలో బాహుబలికి మించి..!

ఆర్ ఆర్ ఆర్ ఆ విషయంలో బాహుబలికి మించి..!

Published on Apr 11, 2020 9:22 AM IST

రాజమౌళి సినిమాలు కొంచెం సుదీర్ఘంగానే ఉంటాయి. ఆయన తీసిన ఇండియన్ బ్లాక్ బస్టర్ బాహుబలి 2 నిడివి ఏకంగా 3 గంటల వరకు ఉంది. బాహుబలి 2 నిడివి 171 నిమిషాలుగా ఉంది. పట్టుసడలని స్క్రీన్ ప్లే ఆసక్తి గొలిపే సన్నివేశాలతో సాగే ఆయన సినిమాల నిడివి ఎక్కువగా ఉన్నా ప్రేక్షకులు బోర్ ఫీలవ్వరు. కాగా ఆయన లేటెస్ట్ పాన్ ఇండియా వెంచర్ ఆర్ ఆర్ ఆర్ నిడివి బాహుబలి 2కి మించి ఉండే అవకాశం కలదు. ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్న నేపథ్యంలో వారిద్దరి పాత్రలను ఇమేజ్ తగ్గట్టుగా నిర్మించి, పూర్తి చేయాలి అంటే ఎక్కువ సన్నివేశాలు తీసుకునే అవకాశం ఉంది.

అలాగే ఈ చిత్రంలో దాదాపు 10 పాటలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం కోసం ఒక్క సుద్దాల అశోక్ తేజ మూడు పాటలు రాసినట్టు చెప్పారు. ఏవిధంగా అంచనా వేసినా ఆర్ ఆర్ ఆర్ నిడివి 3 గంటలకు మించి ఉండడం ఖాయం అని తెలుస్తుంది. ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, చరణ్ అల్లూరి పాత్రను చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 8న ఆర్ ఆర్ ఆర్ విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు