టాలీవుడ్ లో రాజమౌళి దర్శకత్వంలో అతిపెద్ద మల్టీస్టారర్ గా ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కుతుంది. టాప్ స్టార్స్ ఎన్టీఆర్, చరణ్ కలిసి నటిస్తుండగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. దశాబ్దాలుగా టాలీవుడ్ లో పోటీదారులుగా ఉన్న నందమూరి మరియు మెగా ఫ్యామిలీ హీరోలు కలిసి నటించడం అనేది ఆసక్తికర అంశం. వీరిద్దరికి సమాన స్క్రీన్ స్పేస్ ప్రాధాన్యత ఉంటుందని రాజమౌళి చెప్పడం జరిగింది. అటు చరణ్ ఫ్యాన్స్, ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇబ్బంది పడకుండా స్క్రీన్ స్పేస్ పంచే బాధ్యత కథకుడిగా రాజమౌళి తండ్రి గారైన విజయేంద్ర ప్రసాద్ తీసుకున్నారట. ఎన్టీఆర్ మరియు చరణ్ పాత్రలకు సమాన స్క్రీన్ స్పేస్ మరియు ప్రాధాన్యం ఉండేలా ఆయన స్క్రిప్ట్ లో తగు జాగ్రత్తలు తీసుకున్నారట.
రాజమౌళి అన్నగారు మరియు సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి స్వయంగా ఇ విషయాన్ని తెలియజేశారు. కాబట్టి ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ మరియు చరణ్ పాత్రలు సమానమైన స్క్రీన్ స్పేస్ తో అద్భుతంగా ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు. ఇక నిర్మాత డి వి వి దానయ్య ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా వచ్చే ఏడాది జనవరి 8న విడుదల కానుంది. ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న సంగతి తెలిసిందే..