కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు – విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ‘రౌడీ’. మోహన్ బాబు సరికొత్త లుక్ లో చాలా రియలిస్టిక్ గా ఉన్న ఈ మూవీలో మంచు విష్ణు కూడా ఓ హీరోగా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్ర ట్రైలర్ ని ఈ వారాంతంలో రిలీజ్ చేయనున్నారు. ఈ రోజు సాయంత్రం ఎప్పుడు ఎక్కడ ట్రైలర్ ని రిలీజ్ చేస్తాం అనే విషయాలను అనౌన్స్ చేయనున్నారు.
షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మూవీ విషయంలో మోహన్ బాబు, అతని టీం సినిమా బాగా వచ్చినందుకు చాలా ఆనందంగా ఉన్నారు. మోహన్ బాబుకి జోడీగా జయసుధ కనిపించనున్న ఈ సినిమాలో మంచు విష్ణు సరసన శాన్వి కథానాయికగా కనిపించనుంది. ఏవి పిక్చర్స్ బ్యానర్ పై పార్థసారధి – గజేంద్ర – విజయ్ కుమార్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.