‘రౌడీ’ మొదటి షో మహిళలకే అంటున్న మోహన్ బాబు

rowdy

కలెక్షన్ కింగ్ దా. మోహన్ బాబు చాలా రియలిస్టిక్ లుక్ లో రానున్న రాయలసీమ యాక్షన్ డ్రామా ‘రౌడీ’. ఈ సినిమా ఏప్రిల్ 4న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతోంది. సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మంచు విష్ణు మరో హీరోగా కనిపించనున్నాడు.

ఈ సినిమా మొట్ట మొదటి షో విషయంలో డా. మోహన్ బాబు ఓ నిర్ణయం తీసుకున్నారు. ‘రౌడీ సినిమా మొట్టమొదటి ప్రీమియర్ షో మహిళకు మాత్రమే వేసి చూపించాలని నిర్ణయం తీసుకున్నానని’ మోహన్ బాబు ట్వీట్ చేసాడు. రాయలసీమ ఫ్యాక్షన్ గొడవల కథాంశంతో, కాస్త వయొలెన్స్ ఎక్కువగా ఉండే ఈ సినిమాని మోహన్ బాబు మొదట మహిళకు వేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటనేది ఇంకా తెలియలేదు.

డా. మోహన్ బాబు తీసుకున్న ఈ నిర్ణయం సినిమా విజయానికి ఎంతవరకూ ఉపయోగపడుతుందో చూడాలి. సహజ నటి జయసుధ, శాన్వి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి సాయి కార్తీక్ మ్యూజిక్ అందించాడు.

Exit mobile version