హైదరాబాద్ లో రౌడీ ఫెల్లో తదుపరి షెడ్యూల్

nara-rohit
నారారోహిత్ ‘రౌడీ ఫెల్లో’ గా ప్రముఖ పాటల రచయిత కృష్ణ చైతన్య దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాడు. ఇప్పటికే రెండు షెడ్యూల్ లను పుర్తిచేసుకున్న ఈ సినిమా అవుట్ పుట్ తో నారా రోహిత్ ఆనందంగా వున్నాడు. కొత్త షెడ్యూల్ డిసెంబర్ 21నుండి మొదలుకానుంది

ఈ సినిమాలో విశాఖ సింగ్ హీరోయిన్. నందిని రాజ్ సెకండ్ హీరోయిన్. యాక్షన్ కామెడీ గా సాగానున్న ఈ చిత్రంలో నారా రోహిత్ కొత్త లుక్ తో కనిపిస్తూ తనకంటూ ఒక ఇమేజ్ ను సృష్టించుకునే ప్రయత్నంలో వున్నాడు

ఈ సినిమాను సినిమా 5 మరియు మూవీ మిల్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. అరవింద్ కెమెరా వెనక పనిచేస్తున్నాడు. సన్నీ ఎం.ఆర్ సంగీత దర్శకుడు

Exit mobile version