బరిలోకి దిగుతున్న ‘ఛాంపియన్’.. డేట్ ఫిక్స్..!

Champion

టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ మేకా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఛాంపియన్ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా పోస్టర్స్, గ్లింప్స్ ఈ మూవీపై అంచనాలు ఏర్పడేలా చేశాయి. ఇక ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ సి.అశ్వనీదత్ ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ మూవీ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

ప్రదీప్ అద్వైతం డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పీరియాడిక్ స్పోర్ట్స్ చిత్రంగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ఓ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఛాంపియన్ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా 2025 డిసెంబర్ 25న వరల్డ్‌వైడ్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

ఈ సినిమాలో అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటిస్తోండగా మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని స్వప్న సినిమా, జీ స్టూడియోస్, ఆనంది ఆర్ట్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

Exit mobile version