విడుదల తేదీ : అక్టోబర్ 5, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు : గోపరాజు రమణరాజు, సురభి పార్వతి, దివ్య
దర్శకుడు : గట్రెడ్డి హరిప్రసాద్
నిర్మాత : సాయి మాధవ్ బుర్రా
సంగీత దర్శకుడు : ధర్మతేజ
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ఈ వారం ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో ఈటీవీ విన్ ప్రసారం చేస్తున్న కథా సుధలో కొత్త లఘు చిత్రం “అద్దంలో చందమామ” కూడా ఒకటి. ఇక ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
ప్రవచనకర్తగా జాతీయ స్థాయిలో సైతం ఎంతో పేరున్న వేదమూర్తుల సుబ్రహ్మణ్య శాస్త్రి (గోపరాజు రమణ రాజు) తన భార్య గాయత్రి (సురభి పార్వతి) లు తన దాంపత్య జీవితంలో ఎంతో పర్టిక్యులర్ గా ఉంటారు. కానీ వీరికి కలిగిన కూతురు వేదవతి (దివ్య) మాత్రం వారి కుటంబ సంప్రదాయాలకి చాలా భిన్నంగా వ్యతిరేక అభిరుచులతో ట్రెండీ ఆలోచనలతో ఉంటుంది. అలాంటి కూతురు వల్ల ఈ భార్య భర్తల నడుమ కలిగిన స్పర్థలు ఏంటి? ఎందుకు గాయత్రి తన భర్తని వదిలేసి వెళ్ళిపోతుంది? ఆ తర్వాత సుబ్రహ్మణ్య శాస్త్రి పరిస్థితి ఏంటి? ఆమె వెనక్కి తిరిగి వచ్చిందా లేదా? వీళ్ళ కూతురు చేసిన ఘనకార్యం ఏంటి? అనేవి ఇందులో అసలు కథ.
ప్లస్ పాయింట్స్:
ఈ లఘు చిత్రంలో కొన్ని మూమెంట్స్ బాగున్నాయి అని చెప్పొచ్చు. ముఖ్యంగా గోపరాజు రమణరాజు, నటి సురభి పార్వతిల క్యాస్టింగ్ ఆ పాత్రలకి చాలా బాగుంది. మంచి ఎమోషన్ ని క్యారీ చేసే బరువైన పాత్రలని వారు చాలా చక్కగా చేశారు. వీరి నడుమ వచ్చే మొదటి పావు గంటలో సన్నివేశాలు బాగున్నాయి.
వారి దాంపత్య జీవితంపై చూపించిన సీన్స్ కానీ వారి కెమిస్ట్రీ చాలా బాగా అనిపిస్తాయి. అందుకు కారణం వారి నటన కూడా అని చెప్పొచ్చు. ఇక వారి కూతురుగా చేసిన నటి దివ్య బాగా చేసింది. తనకిచ్చిన ట్రెండీ ఆలోచనలు కలిగిన అమ్మాయిగా ఈజ్ నటనతో మంచి లుక్స్ తో ఆమె కనిపించింది.
మైనస్ పాయింట్స్:
ఈ చిత్రంలో కేవలం కొంతమేర మాత్రమే ఆకట్టుకునే కథనం కనిపిస్తుంది అని చెప్పాలి. మెయిన్ గా వేదవతి రోల్ ఇంకా లాస్ట్ 10 నిమిషాల కథనం చాలా వీక్ గా కనిపిస్తాయి. వేదవతి తన తల్లిదండ్రుల దగ్గర నేను మీలా ఉండిపోవాలి అనుకోవట్లేదు నాకో వ్యక్తిత్వం ఉంది అని చెప్తుంది కానీ తన లవర్ తో ఆమె ప్రెగ్నెంట్ అవుతుంది.
అంత వ్యక్తిత్వం పెట్టుకొని ఇలాంటి చేయడంలో లాజిక్ కనిపించదు. సో ఈమె రోల్ పై ఈ అంశం లాజిక్ లేకుండా వీక్ గా అనిపిస్తుంది. ఇక శాస్త్రి గారి పాత్రతో తన భార్య అంత కోపంగా తెగదెంపులు చేసుకొని బయటకి వెళ్లిపోవడం మళ్ళీ తిరిగి రావడం వంటివి కూడా పొంతన లేకుండా ఉంటాయి. అంత ఎమోషన్ లో బయటకి వెళ్ళిపోయాక ఆమెపై కనీస సన్నివేశాలు చూపించలేదు.
భర్త నుంచి బయటకి వచ్చిన తర్వాత భర్త వెర్షన్ సీన్స్ నే చూపించారు కానీ భార్య వైపు నుంచి కూడా చూపించి ఉంటే బాగుండేది. ఇవి మాత్రం ఈ లఘు చిత్రాన్ని ఒక మంచి స్టార్ట్ తర్వాత వీక్ గా మార్చేశాయి. అలాగే స్లోగా సాగే కథనం కూడా.
సాంకేతిక వర్గం:
ఈ లఘు చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. సాయి మాధవ్ బుర్రా నిర్మాతగా తన టేస్ట్ చూపించారు. సంగీతం బాగుంది. పలు సన్నివేశాల్లో ప్రభావం చూపిస్తుంది. కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ బెటర్ గా ఉండాల్సింది. డైలాగ్స్ బాగున్నాయి. ఇక దర్శకుడు గట్రెడ్డి హరిప్రసాద్ విషయానికి వస్తే.. తన లైన్ ఓకే కానీ దానిని పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దలేదు. కేవలం కొన్ని సీన్స్ మాత్రమే పండాయి తప్ప మిగతా కథనం అంతా లాజిక్ లేకుండా, చప్పగా స్లోగా సాగింది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “అద్దంలో చందమామ” ఎపిసోడ్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు అని చెప్పాలి. టాలెంటెడ్ నటుడు గోపరాజు రమణరాజు, సురభిలు తమ పాత్రల్లో ఆకట్టుకునే యత్నం చేశారు కానీ మెయిన్ కథనంలో లోపాలు ఉన్నాయి. సో ఈ లఘు చిత్రం మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team