ఒకేసారి 15 చిత్రాలను ప్రారంభించి ప్రపంచ రికార్డుల్లో నిలిచిన భీమవరం టాకీస్ నిర్మాణాలలో భాగంగా “మహానాగ” రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. సీనియర్ నటుడు సుమన్, హీరో రమాకాంత్, తొలి చిత్రంతో పరిచయమవుతున్న శ్రావణి ముప్పిరాలపై ముహూర్తపు సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సందర్భంగా నిర్మాతల మండలి అధ్యక్షుడు కె.ఎల్. దామోదర ప్రసాద్ క్లాప్ ఇచ్చారు. ప్రముఖ దర్శకుడు రేలంగి నరసింహారావు గౌరవ దర్శకులుగా పాల్గొన్నారు.
తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీకావ్య, టంగుటూరు రామకృష్ణ, బస్ స్టాప్ కోటేశ్వరరావు, జబర్దస్త్ అప్పారావు, సుబ్బలక్ష్మి, టి.ఆర్.ఎస్., ధీరజ అప్పాజీ, సంధ్య వర్షిణి తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మొదటి షెడ్యూల్ హైదరాబాదులో విజయవంతంగా పూర్తయ్యింది. రెండో షెడ్యూల్ తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లో జరగనుంది.
ఒకేసారి 15 చిత్రాలకు పూజలు చేసి చరిత్ర సృష్టించిన రామసత్యనారాయణ, ఏడాది లోపే అన్ని చిత్రాల రిలీజ్ లక్ష్యంగా పెట్టుకున్నారని, అది మరో మైలురాయిగా నిలవాలని అతిథులు ఆకాంక్షించారు.